- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shahrukh khan : పార్టీలో షారుఖ్‌పై చెయ్యేసిన హీరోయిన్

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు బిగ్ ఫ్యాన్ అని ఓ ఇంటర్వ్యూలో వివరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘వన్ టు కా ఫోర్’ సినిమాలో షారుఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. 2017లో ‘దంగల్’ సినిమాలో లీడ్ క్యారెక్టర్‌తో తొలి సూపర్ హిట్ అందుకుంది. ఆ సమయంలో మూవీ కో – స్టార్ అమీర్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఫాతిమాను ఆ పార్టీకి హాజరైన షారుఖ్‌కు పరిచయం చేశాడట. ఈ క్రమంలో షారుఖ్ ఓ జోక్ వేయగా నవ్వుతూ నవ్వుతూ తనను టచ్ చేశానని తెలిపింది. అంతే ఇక ఆ రోజు చేయి కూడా కడగలేదని వివరించింది. ఒకవేళ ఈ విషయం గురించి తెలిస్తే షారుఖ్ తనతో వర్క్ చేయడేమోనన్న ఫాతిమా.. తనతో నటించే చాన్స్ వస్తే మాత్రం వదులుకోనని చెప్పింది. కాగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘అజీబ్ దాస్తాన్స్’తో లేటెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.