- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరో వల్ల ఫీలయ్యా : బాలీవుడ్ భామ ఫాతిమా
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్.. హీరో కార్తీక్ ఆర్యన్‌పై కంప్లయింట్ చేసింది. అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ అంతకు ముందు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్, ఫాతిమా ‘ఆకాశ్ వాణి’ సినిమాలో కలిసి నటించారు. తాము ఒకరిని ఒకరం చూసి గ్రీట్ చేసుకుంటామని తెలిపిన భామ.. కార్తీక్ మాత్రం తనకు సరైన క్రెడిట్ ఇవ్వడం లేదని ఫీల్ అయిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కార్తీక్ పోస్ట్ చేసే చైల్డ్ హుడ్ పిక్స్ తానే క్లిక్ చేశానని, అయితే ఒక్కసారి కూడా తనకు ఆ క్రెడిట్ కార్తీక్ ఇవ్వలేదని చెప్పింది. ప్రతీ ఫొటోగ్రాఫర్‌కు ఇలాంటి బాధ ఉంటుందని అంటోంది ఫాతిమా. రోజువారీ జీవితంలోని అందాలను కెమెరాలో బంధించడం అంటే చాలా ఇష్టమని చెప్తుంది ఫాతిమా. స్ట్రీట్ ఫొటోగ్రఫీ అంటే మరింత ఇంట్రెస్ట్ అని, తన లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసే వ్యక్తులతో కన్వర్జేషన్స్ ఆసక్తికరంగా ఉంటాయని తెలిపింది. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం వల్ల రెండు సార్లు తనను మందలించారని, అప్పటి నుంచి కంపల్సరీ పర్మిషన్ తీసుకుంటానని చెబుతోంది ఫాతిమా.