‘అరువి’ హిందీ రీమేక్‌లో ‘దంగల్’ బ్యూటీ

by Shyam |
Fathima Sana Shaik
X

దిశ, సినిమా: ‘దంగల్’ యాక్ట్రెస్ ఫాతిమా సనా షేక్ మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. చివరగా ‘లూడో’ సినిమాలో కనిపించిన బ్యూటీ పింకీ జైన్‌గా ఆడియన్స్‌ను మెప్పించింది. కాగా ఇప్పుడు తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అరువి’ హిందీలో రీమేక్ అవుతుండగా ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేయనుంది. ఇ.నివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఫెయిత్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా 2021 ఎండింగ్‌లో సినిమా విడుదలయ్యే చాన్స్ ఉంది. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకర్స్, హీరోయిన్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Advertisement

Next Story