- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురుపై కన్నతండ్రి అరాచకం: ఆ పని చేస్తావా.. రేప్ చేయించమంటావా..?
దిశ, వెబ్‌డెస్క్: మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. భార్య, బిడ్డ అనే బేధం ఉండడంలేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై అత్యాచారం చేయిస్తాను అని బెదిరించిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఎంఫిల్ చదువుతున్న ఓ యువతి కుటుంబంతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లో నివసిస్తోంది. అయితే ఆమె తల్లిదండ్రుల మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నడుస్తుండడంతో భార్య, పిల్లలను వదిలి వేరే ఇంట్లో ఉంటున్నాడు.
భార్యతో విభేదాల కారణంగా ఇల్లు ఖాళీ చేయాలంటూ భార్య, కుమార్తెలను గత కొంతకాలంగా యువతి తండ్రి బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఇంటికి వచ్చి మరోసారి బెదిరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. తన తండ్రి తమను బెదిరిస్తున్నాడని. తన తల్లి ఆస్తులను రాసివ్వమని, ఇంటి అద్దెలు తనకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు లో పేర్కొంది. ఇంటి నుంచి వెళ్లకపోతే తనను రేప్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.