ఇంత నీచమా.. భార్యలేదని కూతురితో కామకోరికలు తీర్చుకున్న తండ్రి.. చివరికి

by Sumithra |   ( Updated:2024-03-09 14:14:02.0  )
ఇంత నీచమా.. భార్యలేదని కూతురితో కామకోరికలు తీర్చుకున్న తండ్రి.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో జరిగిన ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన ఇంకా మరువకముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే, కన్నకూతురిని రేప్ చేసిన అరాచక ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌ పరిధిలో నివాసముంటున్న ఓ వ్యక్తి(36) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇక ఇటీవలే అతని భార్య అనారోగ్యంతో మృతిచెందింది.

భార్య మృతి చెందడంతో ఆ కామాంధుడి కన్ను కన్నకూతురిపై పడింది. కూతురికి మాయమాటలు చెప్పి గత 15 రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బాలిక ఏడవడం చూసిన పక్కింటివారు ఏం జరిగిందని అడుగగా విషయం బయటపడింది. దీంతో స్థానికులు ఆమె తండ్రిని పట్టుకొని దేహ శుద్ధి చేశారు. అనంతరం డయల్ 100కు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన ఆ కామాంధుడిని వదిలిపెట్టకూడదని, కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story