కూతురుకి ఉరేసి చంపి.. తానూ వేసుకుని..!

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కూతురికి మొదట ఉరివేసి చంపి, ఆపై తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి రాగా, స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకివెళితే.. తమిళనాడుకు చెందిన గణేశ్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కూతురితో చిత్తూరులోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. అయితే, తన భార్య కొంతకాలంగా పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆరోపించాడు. దాంతో మనస్థాపం చెందిన అతడు నాలుగేళ్ల వయస్సున్న తన కూతురికి మొదట ఉరివేసి చంపి, ఆపై తానూ ఉరేసుకుని చనిపోయాడు.

అంతకు ముందు గణేశ్ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. తమ చావుకు భార్యే కారణమని చెబుతున్న మాటలు అందులో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం తండ్రీకూతుళ్ల మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement