కూతురిని గర్భవతిని చేసిన తండ్రి

by srinivas |   ( Updated:2021-07-15 04:05:48.0  )
కూతురిని గర్భవతిని చేసిన తండ్రి
X

దిశ, ఏపీ బ్యూరో: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెస్తవారిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకులు తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అప్పటి నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరిస్తూ ఏడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా బాలిక తండ్రి రూపంలో ఉన్న మానవమృగం కోరిక తీర్చకపోవడంతో బాలికను చిత్రహింసలకు గురి చేసాడు. తండ్రి వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ బాలిక డయల్ 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే బాలిక శరీరంలో మార్పులను గమనించిన వారు పరీక్షించగా బాలిక 5 నెలల గర్భవతి అని తేలింది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరని ఆరా తియ్యగా కన్న తండ్రే అని చెప్పడంతో అంతా షాక్ కి గురయ్యారు. తండ్రి చేసిన ఘోరాన్ని చెప్పి బోరున విలపించింది. దీంతో అమ్మమ్మ తాతయ్యలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story