కూతురు తల నరికి.. నడిరోడ్డులో ఊరేగిస్తూ.. యూపీలో దారుణం

by Sumithra |   ( Updated:2021-03-03 21:56:28.0  )
crime
X

దిశ, వెబ్ డెస్క్ : తన కూతురు ప్రేమలో పడిందని తెలిసి ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆ యువతి తల నరికాడు. ఆనక ఆమె మొండాన్ని ఇంట్లోనే వదిలేసి తలను రోడ్డుపై పట్టుకుని ఊరేగాడు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

యూపీలోని హర్దోయ్ జిల్లాకు చెందిన సర్వేశ్ కు భార్య, ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉంది. సర్వేశ్ కూతురు కొద్దికాలంగా ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఇది తెలిసిన సర్వేశ్.. ముందు ఆమెను మందలించాడు. కానీ ఆ యువతి తండ్రి మాటను లైట్ తీసుకుంది. కూతురు తన మాటను వినడం లేదనే ఆగ్రహంతో రగిలిపోయిన సర్వేశ్.. ఆమెను హతమార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం ఉదయం ఆమె తలను నరికేశాడు సర్వేశ్. అనంతరం మొండాన్ని ఇంట్లోనే ఉంచి, తలను పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు. దానిని చేతపట్టి కొంతదూరం దాకా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ భయానక దృశ్యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సర్వేశ్ దగ్గరికి చేరుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాట వినకపోవడంతోనే తన కూతురును కత్తితో తల నరికినట్టు ఒప్పుకున్నాడు. మీకు రుజువులు కావాలంటే తన ఇంటికెళ్లి బాడీని తీసుకొచ్చుకోండని పోలీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story