- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళ్లు పడిపోయినా.. ‘ఎక్సోస్కెలిటన్’తో నడవొచ్చు
దిశ, ఫీచర్స్ : ‘ఆర్డినరీ లైఫ్ ఫర్ ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్’ అనే కాన్సెప్ట్‌తో నికోలస్ సైమన్ ‘వండర్‌క్రాఫ్ట్’ అనే కంపెనీని తన ఇద్దరు మిత్రులు అలెగ్జాండర్, మాసెలిన్‌తో కలిసి 2012లో స్థాపించాడు. అయితే ‘ఎక్సో స్కెలిటన్’ పేరుతో వాకింగ్ రోబోలను తయారుచేస్తోన్న ఈ కంపెనీ బృందంతో.. రోబోటిక్ ఇంజనీర్ లూయిస్ కాన్‌స్టాంజా జత కలిశాడు. ప్రస్తుతం కంపెనీలో చీఫ్ బిజినెస్, క్లినికల్ ఆఫీసర్‌గా లూయిస్ పనిచేస్తుండగా, అతడి కుమారుడు 16ఏళ్ల ‘ఆస్కార్’ జన్యుపరమైన నరాల బలహీనత వల్ల నడవలేకపోతున్నాడు. ఆ కుర్రాడు మళ్లీ సాధారణ మానవుడిలా నడిచేందుకు తండ్రి ఎక్సో స్కెలిటన్‌ను మరింత అభివృద్ధి చేసి, కొడుకు నడవడంలో సాయపడుతున్నాడు.
16 ఏళ్ల ఆస్కార్‌కు జన్యుపరమైన నాడీ సంబంధిత వ్యాధి వల్ల కాళ్లు చచ్చుబడిపోయాయి. అతడు నడవాలంటే ఒకరి సాయం తీసుకోవాల్సిందే. అయితే అందరిలా తాను నడవలేకపోతున్నందుకు బాధపడుతున్నా.. తన వల్ల మరొకరిని ఇబ్బంది పెడుతున్నాననే భావన ఆస్కార్‌కు మరింత వేదన కలిగించింది. ఈ క్రమంలో రోబోటిక్ ఇంజనీర్ అయిన తన తండ్రిని తను నడించేందుకు సహకరించే ఒక రోబో తయారుచేయమని అడిగాడు. దాంతో తండ్రి పారిస్‌లోని వాండర్‌క్రాఫ్ట్ ప్రధాన కార్యాలయ అధికారులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. అలా తయారైన ఈ ఆధునాతన ‘ఎక్సో స్కెలిటన్’ ధరించిన వ్యక్తి ఆదేశాలననుసరించి నడిపించేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా మెదడు నుంచి కాళ్లకు సమాచారం అందగానే మనం నడక మొదలు పెడతాం. కానీ ఎక్సో స్కెలిటన్ కలిగి ఉన్న వ్యక్తులకు రిమోట్ కంట్రోలర్ ద్వారా కాళ్ళకు సిగ్నల్స్ వెళతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీలు కూడా ఎక్సోస్కెలిటన్‌లను తయారు చేస్తున్నాయి. వాటిని వీలైనంత తేలికగా, ఉపయోగకరంగా చేయడానికి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఈ మేరకు వాండర్‌క్రాఫ్ట్ ఎక్సోస్కెలిటన్ శరీర కదలికకు మద్దతు ఇస్తూ సదరు వ్యక్తి స్వేచ్ఛగా నడవడంలో సాయపడుతోంది. ఫ్రాన్స్, లక్సెంబర్గ్, యునైటెడ్ స్టేట్స్‌లోని డజన్ల కొద్దీ ఆసుపత్రుల్లోని పేషెంట్స్‌కు వీటిని అందజేశారు. దీని ధర సుమారు 150,000 యూరోలు ఉంటుంది. రాబోయే పదేళ్లలో వీల్‌చైర్లు ఉండవని కంపెనీ అభిప్రాయపడింది.
- Tags
- exoskeleton
- Oscar