రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం తండ్రీకొడుకుల ప్రాణాలు తీసుకుంది. బాధిత కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కల్యాణ చక్రవర్తి, సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story