కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన తండ్రి,కూతురు

by Aamani |   ( Updated:2021-05-06 06:36:47.0  )
కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన తండ్రి,కూతురు
X

దిశ,ఎల్లారెడ్డి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎతైన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి, తన కూతురితో కలిసి అధిరోహించాడు. తిరునగరి శ్రీకాంత్, అతని కుమార్తె హిమలేఖ్య కిలిమంజారో పర్వతం గిల్మన్ 5685 మీటర్ల పాయింట్ ను అధిరోహించారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వీరిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖను పంపారు. “ధైర్యంతో, దృఢసంకల్పంతో కష్టసాధ్యమైన, అరుదైన ఘనత సాధించిన తండ్రి, కుమార్తెలు తెలంగాణకు గర్వకరణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహించే దిశగా మున్ముందు మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొంటూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు” తెలిపారు. అనంతరం మండల ప్రజలు, స్థానికులు తిరునగరి శ్రీకాంత్, అతని కుమార్తె హిమలేఖ్యకు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed