- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ‘గే మ్యాన్’ కాదు.. ‘ట్రాన్స్ ఉమెన్’ : బాలీవుడ్ సెలెబ్రిటీ
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. ‘నేను ఇప్పుడు గే మ్యాన్ కాదు, ట్రాన్స్ ఉమెన్‌గా మారిపోయా’ అంటూ ప్రకటించిన స్వప్నిల్.. సైషాగా పేరు మార్చుకుంటున్నట్లు తెలిపాడు. చిన్నప్పటి నుంచి బాధలతో కూడిన ఒంటరితనంతో బతికానని.. తానేంటో తనకే అర్థంకాని గందరగోళ జీవితాన్ని అనుభవించానని వెల్లడించాడు. స్కూల్, కాలేజ్ లైఫ్‌లో బాయ్స్ తనను ఏడిపించేవారని.. అందరూ డిఫరెంట్‌గా చూస్తుండటం చాలా బాధ కలిగించేదన్నాడు. రియాలిటీలో బతుకుతున్నా.. సమాజం తనను ట్రీట్ చేసే విధానం ఊపిరాడనిచ్చేది కాదన్నాడు. 20 ఏళ్లు వచ్చినప్పుడు ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)’లోకి అడుగుపెట్టాకే నిజాన్ని యాక్సెప్ట్ చేసి, ధైర్యంగా ముందడుగు వేశానని తెలిపాడు. అయితే కొన్నాళ్ల తర్వాత.. తను పురుషులకు అట్రాక్ట్ అవుతున్న ‘గే’ అని అర్థమైందన్నాడు. అయితే తానిప్పుడు ‘గే మ్యాన్ కాదు.. ట్రాన్స్ ఉమెన్’ అని క్లారిటీ ఇచ్చాడు స్వప్నిల్.. కాదు కాదు సైషా.