- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా భూముల జోలికి రావొద్దు… ప్రభుత్వానికి ఆరెపల్లి రైతుల అల్టిమేటం
X
దిశ ప్రతినిధి, వరంగల్: భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని వరంగల్ పట్టణ శివారు, 3 డివిజన్‌లోని ఐదు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ ఏనుమాముల, కొత్తపేట, ఆరెపల్లి, పైడిపల్లి, మొగిలిచర్ల గ్రామాల రైతులు గత ఐదు రోజులుగా నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. తమ భూముల జోలికి రావొద్దంటూ సోమవారం గ్రీవెన్స్‌లోనూ వరంగల్, హన్మకొండ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.
మంగళవారం నుంచి మరింతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ పొట్టకొట్టేందుకు యత్నిస్తే మాత్రం ఆత్మహత్యలైనా చేసుకుంటామని, కానీ భూములు మాత్రం ఇవ్వబోమని చెబుతున్నారు.
Advertisement
Next Story