NOC కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు..

by Shyam |
NOC కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు పాలనాధికారులు వస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ ఆ రైతుల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. అన్నదాతలు తమ భూములను అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇబ్బందు లు తలెత్తుతున్నాయి. కలెక్టర్ ​ఇచ్చే నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్ పైనే ఆ భూముల భవితవ్యం ఆధారపడి ఉండటంతో జిల్లాలోని వంద మంది రైతులు ఐదారేళ్ల క్రితం కలెక్టర్​కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2‌‌005 నుంచి నేటి వరకు NOC కమిటీ మీటింగ్​ నిర్వహించలేదు. దీంతో తమ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొందరి పట్టా భూములను అధికారులు నిర్లక్ష్యంగా లావణీ పట్టా (ప్రభుత్వ భూమి)గా న మోదు చేయడంతో అసలు సమస్య తలెత్తింది. దీంతో క్రయవిక్రయాల విషయంలో, రిజిస్ట్రేషన్​సమయంలో సంబంధిత అధికారి కలెక్టర్​ నుంచి ఎన్​వోసీ సమర్పించాలని సూచిస్తున్నారు. జి ల్లాలో వంద మందికి పైగా రైతులు కలెక్టరేట్ ఇన్ వార్డులో NOC కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లా లో 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్​వోసీ కమిటీ సమావేశం నిర్వహించలేదు. దీంతో రైతులకు నేటికీ నోఆబ్జక్షన్​ సర్టిఫికె ట్లు అందక ఇబ్బంది పడుతున్నారు. భూముల న మోదు సమయంలో వీఆర్వోలు చేసిన తప్పిదాల కు తామంతా ఏళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని, తమ ఫైల్ ​ఎంత వరకు వచ్చిందని అధికారులకు మొరపెట్టుకున్నా సమాధానం ఇ వ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ ములను అమ్ముకోవాలకుంటే, ఆ భూములకు రి జి స్ట్రేషన్ కాదని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నారు.

అధికారుల తప్పిదంతోనే ఇబ్బందులు..

గతంలో రెవెన్యూ శాఖలో మ్యాన్యువల్ ​విధానం అమలులో ఉండగా, ప్రస్తుతం ఆన్ లైన్ విధానం అమలులో ఉంది. మ్యాన్యువల్​ విధానంలో వీఆర్వో పహాణీలో రైతుల పేర్లు, భూ వివరాలను వన్ బీ లో నమోదు చేసేవారు. తరువాత ఆర్ఐ, డీటీ, తహసీల్దార్​ పహాణీని పరిశీలించాలి. వా టిని ఆర్డీవో ఆఫీసులో అధికారులు పరిశీలించిన త రువాత ఆర్డీవో వద్దకు గ్రామానికి సంబంధించిన పహాణీ పుస్తకం వెళ్లేది. ఈ తతం గం నామామాత్రంగానే జరగడంతో వీఆర్వోలు పహాణీలో పొందుపర్చిందే ఫైనల్ అయ్యేది. ఈ క్రమంలో పట్టా భూములు సైతం లావణీ పట్టా (ప్రభుత్వ భూమి) గా నమోదు చేయడంతో నిరక్షరాస్యులైన రైతులు దీనిని పట్టించుకోలేదు. అ యితే ఆ భూముల అమ్మకం, కొనుగోలు సమ యంలో వీఆర్వోలు చేసిన తతంగం బయటపడింది. పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా నమో దు చేశారని, ఇప్పటికైనా తమ సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.

విచారణతో సరి..

రైతుల దరఖాస్తులపై ఆర్డీవో విచారణ చేస్తారు. అక్కడ నుంచి రిపోర్ట్ పై ఏవో, సూపరింటెండెం ట్ మరోసారి ఎంక్వైరీ చేస్తారు. ఇందులో భాగం గా ఏడీ ల్యాండ్ అండ్ సర్వే శాఖ, జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మరోసారి విచారణ చేస్తారు. ఆ భూమి దరఖాస్తుదారులా.. ప్రభుత్వానిదా, లేక అటవీశాఖ భూములా అధికారులు తేల్చాల్సి వుం టుంది. ఈ విచారణ పూర్తయిన తరువాత రిపోర్ట్ ను కలెక్టరేట్ ఇన్ వార్డ్ కు పంపిస్తారు. గ్రామం, మండలం, డివిజన్ నుంచి జిల్లా స్థాయి అధికారులు విచారణ పూర్తి అయ్యే వరకూ మూడు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. ఆ తరువాత కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని ధృవపత్రాలను పరిశీలించిన తరువాత సరి గా ఉన్న రైతులకు నోఆబ్జక్షన్​ సర్టిఫికెట్లు అందజేస్తారు.

అయితే జిల్లాలో 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్ వోసీ కమిటీ సమావేశం జరగలేదు. అయితే వివిధ హోదాలో ఉన్న అధికారులు దరఖాస్తు చేసుకున్న రైతుల్లో చాలా మందిదే పట్టాభూమని నిర్ధారించినా ఇంత వరకు మీటిం గ్ నిర్వహించకపోవడం శోచనీయం. అన్ని ధ్రవపత్రాలు సక్రమంగా ఉన్న రైతులు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత మూడు తేదీలు ఖరారు చేసినప్పటికీ అనివార్య కారణాలతో చివ రి సమయం సమావేశాలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి వంద మందికి పైగా రైతుల ఫైళ్లు ఇన్ వార్డ్ లోనే మూలుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్ వో సీ కమిటీ సమావేశం నిర్వహించి సర్టిఫికెట్లు అందివ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed