- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘వాటిపై రైతులకు అవగాహన కల్పించాలి’
దిశ, న్యూస్ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువులు, పురుగుల మందుల వాడకం చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి వీలైనంత ఎక్కువ మట్టినమూనాలు సేకరించి సమయానికి రైతులకు వాటి ఫలితాలను అందజేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. మట్టి నమూనాల ఫలితాలను సిఫారసు చేసిన దాని ప్రకారం ఎరువులు వాడేలా అవగాహన కల్పించాలన్నారు. బయోపెప్టిసైడ్స్(జీవసంబంధ పురుగుల మందు), జీవన ఎరువులు, బూసార పరీక్షల గురించి వ్యవసాయశాఖ అధికారులతోపాటు, రైతుబంధు సమితి సభ్యులకు అవగగాహన కల్పించేందుకు కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కనీసం ఐదు మంది రైతులకు పొలంలో డిమాన్‌స్ర్టేషన్‌లు, భూసార పరీక్షా ఫలితాల ప్రకారం ఎరువుల వాడకం, పిఎస్‌బి వాడకం, జీవసంబంధ మందుల వాడకం పై ఫీల్డ్ డే నిర్వహించి రైతులకు వీటి వాడకం పై ప్రాముఖ్యతలను గురించి తెలియజేయాలన్నారు. అనంతరం రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు బాగా కృషి చేసి దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారని అన్నారు. అదే విధంగా నియంత్రిత సాగు విధానం పై గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రైతుబంధు సభ్యులు భూసార పరీక్షలపై అవగాహన పెంచి ఎరువుల వాడకాన్ని తగ్గించేలా చూడాలన్నారు.