- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోకాళ్లపై కూర్చోని గుంజీలు తీసిన రైతులు.. ఎందుకో తెలుసా?
దిశ, తుంగతుర్తి: తరుగు తీసిన ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఆదివారం రైతులు గుంజీలు తీస్తూ, అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణి పార్టీ నాయకులు తన్నీరు వెంకన్న మాట్లాడుతూ.. మండలం పరిధిలోని అన్నారం, సంగెం ఐకేపీ కేంద్రాల్లో క్వింటాలుకు 5 నుండి 10 కిలోల ధాన్యం తరుగు కింద తీసి రైతుల పొట్టకొట్టారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసి నెలరోజులు దాటినా.. పట్టించుకోలేదన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తరుగు తీసిన ధాన్యానికి డబ్బులు ఇప్పించాలని, లేకపోతే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, గవర్నర్‌కు, హైకోర్టుకు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రైతుల న్యాయమైన డిమాండైన తరుగు ధాన్యం డబ్బులు చెల్లించేవరకూ రైతులు చేసే ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఉంటుందని ప్రజావాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పూసపల్లి శ్రీను, గోపగాని వెంకట రామనర్సయ్య, తన్నీరు సోమనర్సయ్య, బాజే ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.