- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కలెక్టర్ కోసం అన్నదాత ఆత్మహత్యాయత్నం
దిశ, జగిత్యాల : రైతులు కష్టాలను తీర్చేందుకు తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మిల్లర్ల మోసాలు ఆరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట గల రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ రవికి వినతి పత్రం అందజేయాలని రైతులు కోరగా.. ఆయన బయటకు రాకపోవడంతో ఓ రైతు డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో సుమారు 4 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు గురజాల రాజు రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట ఇకనైనా మాని వరి ధాన్యం కొనుగోలుతో పాటు యాసంగి వరి పంట సాగు పై స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తూ తక్షణం చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లాలోని ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమైన ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో దోపిడీకి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు శేర్ నర్సారెడ్డి , కోడిపెల్లి గోపాల్ రెడ్డి, వామన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఏనుగు రమేష్ రెడ్డి, మేకల మల్లేష్, రవీందర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రవి , వేముల కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.