ఇంద్రవెల్లిలో రోడ్డెక్కిన రైతులు

by Aamani |
ఇంద్రవెల్లిలో రోడ్డెక్కిన రైతులు
X

దిశ, ఆదిలాబాద్: సోయాబీన్ విత్తనాల కొరతను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి‌లో రైతులు ఆందోళన చేపట్టారు. కేవలం రెండు రోజులపాటు సోయాబీన్ విత్తనాల పంపిణీ చేపట్టిన అధికారులు స్టాక్ ఆయిపోయిందని చెప్పడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించి వెంటనే సోయా విత్తనాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో రహదారి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు సబ్సిడీ సోయాబీన్ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ధర్నాలో ఆదివాసీ సంఘం మండల నాయకుడు మెస్రం మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు ఆరేళ్లీ రాజలింగు, పోటె సాయినాథ్, దీపక్ సింగ్ షేకావత్, సోయం రాందాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story