- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావి మాకు కావాలి.. లేకుంటే ఆత్మహత్యలే
by Shyam |
X
దిశ, మునుగోడు: మా భూములు మాకు కావాలంటూ రైతులు పెట్రోల్ బాటిళ్లతో అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వే నెం.50లో భూములను అటవీ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఎన్నో ఏండ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, గతంలో ప్రభుత్వం తమకు పట్టాలు కూడా ఇచ్చిందని బాధితులు వాపోయారు. తాము సాగు చేసుకుంటున్న భూమి అటవీ శాఖకు సంబంధించి అంటూ మొక్కలు నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ రికార్డుల్లో కూడా అటవీ భూమిగా నమోదు కాలేదని, ప్రభుత్వ భూమనే ఉందని రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్లో మొక్కలు నాటితే అందరం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
Advertisement
Next Story