ప్రతి పంటను ప్రభుత్వమే కొంటుంది

by Shyam |
ప్రతి పంటను ప్రభుత్వమే కొంటుంది
X

దిశ, వరంగల్: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని ఎల్లంపేట తండా, ధర్మారం, మరిపెడ, తానంచర్ల, ఆనేపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే, పీఎసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగే ఆస్కారం లేదన్నారు. రైతులు ధాన్యాన్ని తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకుని రావాలని, వ్యవసాయ శాఖ ఇచ్చే కూపన్ ద్వారా కాంటాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా రైతులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తాగునీరు, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.

tags; corona, lockdown, paddy purchase centre, mla redya naik, farmers use full

Advertisement

Next Story

Most Viewed