- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నడి రోడ్డుపై రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..
దిశ, చిట్యాల : ఎరువుల బస్తాల బాకీ కింద ఫర్టిలైజర్ షాపు యజమాని మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడనే మనస్థాపంతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాగం సతీష్.. ఓ వ్యాపారి దగ్గర రూ. 83,000 ఎరువులను తీసుకున్నాడు. దీనిపై వడ్డీ వడ్డీకి వేసి సదరు వ్యాపారి అక్రమంగా తమ మూడెకరాల వ్యవసాయ భూమిని పట్టా చేసుకున్నాడన్నారు.
విషయం తెలుసుకున్న రైతు రాగం సతీష్, తల్లి రాజమ్మ, కుటుంబ సభ్యులు వ్యాపారి.. మలక రాజేశ్వరరావు ఇంటి ముందు పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎరువుల వ్యాపారి ఇంట్లో లేకపోవడంతో ఇంటి ముందే బైఠాయించి వారు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్తున్నట్లు సమాచారం.