పట్టాల కోసం పెట్రోలు పోసుకున్న రైతు

by Shyam |
పట్టాల కోసం పెట్రోలు పోసుకున్న రైతు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :సాగు భూములకు పట్టాల కోసం ఒక రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా అటవీ శాకాధికారి కార్యాలయం ఎదుట బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం కళ్ళేడి గ్రామంలోని సుమారు 100 మంది రైతులు ఆందోళన చేపట్టారు. తాము 1965 నుంచి సాగు చేసుకునుటున్న భూమికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని జిల్లా అటవీ శాకాధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

తాము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు వేసుకొని, విద్యుత్ మీటర్లను బిగించుకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. వెంటనే రెవిన్యూ -అటవీ శాఖధికారులు జాయింట్ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అటవీ శాఖ అధికారులు స్పందించడం లేదని రోడ్ పై బైటయించి రాస్తా రోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రాస్తా రోకో చేసిన వారిని అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొందరు రైతులు కలెక్టర్ కార్యాలయంకు తరలి వచ్చి పిర్యాదు చేసారు.

Advertisement

Next Story