- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు పదే పదే చెప్పినా.. అది కుదరదు
దిశ, షాద్‌నగర్: నియంత్రిత పంటల సాగు చేయాలని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు చెప్తున్నారు. చెప్పిన పంటు వేస్తేనే రైతుబంధు వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, రైతులు మాత్రం చెప్పిన పంటలు వేయడం కుదరదని, ఎప్పుడూ సాగు చేసే పంటలే వేస్తామని చెప్తున్నారు. నియంత్రిత సాగులో భాగంగా క్లస్టర్లుగా గుర్తించి సాగుచేసే పంటల వివరాలను ప్రకటిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా సాగు చేసే పంటలు ప్రాథమికంగా ఖరారయ్యాయి. జిల్లాల వారీగా ఖరారు చేసిన పంటల సాగు వివరాలను గ్రామ స్థాయిలో ఇంకా స్పష్టం చేయలేదు. ఈసారి త్వరగానే రుతుపవనాలు రావడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. మక్కల సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్తుండగా.. రైతులు మక్కల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాల రైతులు మక్కల సాగుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్తి సాగు చేయాలంటుండడంతో అనుమతి లేని బీటీ3 పత్తి విత్తనాల విక్రయాలు కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
మక్కల సాగుకు అవకాశం ఇవ్వాలి: శ్రీనివాస్ రెడ్డి, రైతు, షాద్‌నగర్
ప్రభుత్వం తమకు మక్కలు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే బాగుంటది. సమగ్ర వ్యవసాయ విధానం నీటిపారుదల లభ్యత ను బట్టి అమలు చేయాలె. మక్కల సాగు వల్ల పశువులకు మేత, దాణా లభిస్తుంది. 2,3 వర్షాలు కురిస్తే చాలు. అందరూ పత్తి సాగుచేస్తే కూలీల కొరత ఏర్పడటమే కాక పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి.