హైకోర్టుకు లేఖ రాసిన రైతు.. ఏమని అంటే?

by Sridhar Babu |
హైకోర్టుకు లేఖ రాసిన రైతు.. ఏమని అంటే?
X

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఓ రైతు హైకోర్టుకు లేఖ రాశారు. ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాళుకు 5 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేయించుకున్నారని ఆరోపించారు. అలాగే, కోనుగోళ్ల సెంటర్లలో తూకాన్ని తక్కువగా చేసి పంపిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో తూకం అయిన లారీని వే బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి.. తాము వెయిట్ చెక్ చేయించగా తక్కువ ధాన్యం ఉన్నట్టుగా తక్ పట్టీలో రాసిచ్చిన విషయం తేటతెల్లం అయిందని వివరించారు. ఈ విధంగా ఒక్కో లారీకి.. రెండు టన్నుల ధాన్యానికి రూ.36070ల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో రాష్ట్రం మొత్తం మీద 63.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, జగిత్యాల జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. తాలు తరుగు పేరిట వేల కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోయారని వాపోయారు. ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి జగిత్యాల జిల్లాలో విచారణ జరిపించాలని రైతు మురళీ హైకోర్టును వేడుకున్నారు. తరుగు పేరిట తగ్గించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed