పొజిషన్ మార్పిడి చేశారంటూ సెల్‎టవర్ ఎక్కిన రైతు..!

by Shyam |
పొజిషన్ మార్పిడి చేశారంటూ సెల్‎టవర్ ఎక్కిన రైతు..!
X

దిశ, కొడంగల్: 40ఏళ్లుగా పొజిషన్‎లో ఉన్న భూమిని తహశీల్దార్ లంచం తీసుకొని వేరే వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపిస్తూ.. ఓ రైతు సెల్‎టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి పురపాలక పరిధిలోని సంపల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామ శివారులో శ్రవణ్ కుమార్ రెడ్డికి చెందిన మూడు ఎకరాల పట్టా భూమి ఉంది. ఇట్టి భూమిని గత 40ఏళ్లుగా ఇదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు కాస్తు చేస్తూ పొజిషన్‎లో ఉన్నాడు. కాగా, ఇటీవలి కాలంలో మండల తహశీల్దార్ రాంకోటి లంచం తీసుకుని కృష్ణారెడ్డి అనే రైతుకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని నారాయణరెడ్డి ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు నిరసన ఆపేది లేదని రైతు స్పష్టం చేశాడు. నారాయణరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ రాంకోటి ఘటనాస్థలికి చేరుకుని న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడంతో రైతు నిరసన విరమించారు.

Advertisement

Next Story