ఉగ్రరూపం దాల్చిన వాగు.. రైతుతో సహా రెండు ఎడ్లు..

by Aamani |
Jinnaram
X

దిశ, జన్నారం: అకస్మాత్తుగా వాగు ఉప్పొంగడంతో రైతు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటనలో రెండు ఎడ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోగా, రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. జన్నారం మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ అన్వర్ శనివారం తన ఎడ్ల బండిపై వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. అయితే ఉదయం నుంచి మండలంలో కురుస్తోన్న వర్షాలకు దారిలో ఉన్న వాగుకు వరద భారీగా పెరిగింది. ఇది గమనించని అన్వర్ ఎడ్ల బండితో సహా వాగును దాటే ప్రయత్నం చేయగా.. నీటి ఉధృతికి రెండు ఎడ్లు కొట్టుకుపోయి మృతి చెందాయి. అన్వర్‌ను సమీపంలోని రైతులు రక్షించారు. ఎడ్ల విలువ రూ.లక్ష ఉంటుందని రైతు తెలిపాడు.

Advertisement

Next Story