- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతు మెడకు ఉరితాడై బిగుసుకున్న ‘అప్పు’
దిశ, హుజురాబాద్ రూరల్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఒక్కొక్కరుగా నేలరాలుతున్నారు. స్థానిక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే రైతులు బలవన్మరణాలకు పాల్పడు తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన తాడూరి శ్రీనివాస్ అనే రైతు సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికుల కథనం ప్రకారం.. తాడూరి శ్రీనివాస్(40) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అప్పుల భారం పెరిగిపోవడం.. డబ్బులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన రైతు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.