తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, కరీంనగర్: రెవెన్యూ అధికారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాము ఏం చేసినా చెల్లుతుందన్నట్టుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్లు గల్లంతు చేస్తు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పారిపెళ్ళి జనార్దన్ రెడ్డి అనే రైతు కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని తన 12 ఎకరాల వ్యవసాయ భూమిని వీరారెడ్డి అనే వ్యక్తికి ఆన్ లైన్‌లో పట్టా చేశారంటూ ఆరోపించాడు. తన భార్యా పిల్లలతో సహా తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పారుపల్లి జనార్ధన్ పారుపల్లి వీరారెడ్డి ఇద్దరు అన్నదమ్ములిద్దరకీ తమ తండ్రి ద్వారా సంక్రమించిన 12 ఎకరాల భూమిని ఇద్దరి పేరిట మార్చాల్సి ఉన్నప్పటికీ అక్రమంగా తన తమ్ముడు వీరారెడ్డి పేరిట ఆన్‌లైన్ చేశారని ఆరోపించారు. రెండు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని అందుకే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చామని రైతు వివరించాడు. తహసీల్దార్ హుటాహుటిన బయటకు వచ్చి రైతు వద్ద నుంచి మందు డబ్బా లాక్కొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed