- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సిన్ వద్దంటే వద్దు.. చుక్కలు చూస్తోన్న మెడికల్ సిబ్బంది
దిశ, జగిత్యాల : కరోనా టీకా వేయించుకోవడం వలన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని మెడికల్ సిబ్బంది చెబుతున్నా కొందరు ప్రజలు వినిపించుకోవడం లేదు. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలోనే మెడికల్, ఆశావర్కర్ల సిబ్బంది టీకాలు వేసేందుకు ఇంటింటికీ వెళ్తుతుండగా.. కొందరు జనాలు వారికి చుక్కలు చూపిస్తున్నారు. మాకు టీకా వద్దే వద్దు అంటూ గొడవకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ రైతు టీకా వేయించుకోకుండా దొరికాడు. టీకా తీసుకోవాలని కోరగా ఆ రైతు వద్దని నిరాకరించాడు. ఎంత బతిమిలాడినా వినిపించుకోవడం లేదు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరి పెల్లికి చెందిన లక్ష్మణ్ అనే రైతు వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో సంబంధిత అధికారులు డోర్ టు డోర్ సర్వేలో భాగంగా లక్ష్మణ్ వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ మొండి పట్టుపట్టారు. అయితే, తన భార్యకు షుగర్ ఉండగా వ్యాక్సిన్ వేశారని దీంతో వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఆమెను బతికించుకున్నామని, ఆ ఖర్చు మొత్తం మీరు ఇస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అదే విధంగా తనకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని, సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగాడు . దీంతో ఏం చేయాలో తోచని వైద్యాధికారులు తిరిగి వెళ్ళిపోయారు.