- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కన్నీరు చూడలేకే నిరసన దీక్ష.. ఢిల్లీ తరహా ఉద్యమం ఖాయం
దిశ ప్రతినిధి, నల్లగొండ : రైతును ఏడిపించే రాష్ట్రం బాగుపడదని భువనగిరి ఎంపీ భువనగిరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పంట కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా నేడు నకిరేకల్ మార్కెట్ యార్డ్‌లో వడ్లపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు ఈ నిరసన ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం ఎప్పటికీ బాగుపడవని తెలిపారు. రైతులను నానా ఇబ్బందులను గురిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి పుట్ట గతులుండవని వివరించారు.
వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. పంట కోతలు మొదలై నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు పంటలు కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. నిన్న మొన్న పడ్డ అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందన్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. సర్కార్ ధాన్యం కొనుగోలు చేసే వరకు నకిరేకల్ యార్డ్ తన నిరసన కొనసాగుతుందని తెలిపారు.
నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు రైతుల ఓట్ల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు వాటిని పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం సర్కార్ కొనకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని వివరించారు. దీంతో రైతన్నలు అప్పుల పాలవుతున్నారని వెల్లడించారు.