రద్దు చేయకపోతే ఏడాది పాటు ఆందోళనలు: రైతులు

by Shamantha N |   ( Updated:2020-12-05 07:54:17.0  )
రద్దు చేయకపోతే ఏడాది పాటు ఆందోళనలు: రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో రైతుల సంఘాలతో జరిగిన కేంద్ర ప్రభుత్వ చర్చల్లో ప్రతిష్టంబన నెలకొంది. చర్చలు జరుగుతుండగానే కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ బయటకు వెళ్లిపోయారు. సోమవారం మరోసారి చర్చలకు కేంద్రం ప్రతిపాదించింది. దీంతో రైతుల సంఘాల నాయకులు కూడా అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. ఇక కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ నెల 8న భారత్‌బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు ఢిల్లీలోనే ఏడాది పాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరికలు చేశారు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఉత్తర భారతంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారితో చర్చలకు కేంద్ర అనుమతి ఇచ్చినా చర్చలు మాత్రం సఫలం కాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed