గుర్తుతెలియని వాహనం ఢీకొని రైతు మృతి

by Sumithra |
Muddhirala1
X

దిశ, మద్దిరాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని రైతు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డి గూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉయ్యాల భద్రయ్య(55) రోజు మాదిరిగా తెల్లవారుజామున వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా రెడ్డిగూడెం గ్రామ స్టేజ్ వద్ద నేషనల్ హైవే 365 పై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story