మిల్లర్ల దోపిడీ.. కడుపు కాలిన అన్నదాత ఏం చేశాడంటే?

by Sridhar Babu |
మిల్లర్ల దోపిడీ.. కడుపు కాలిన అన్నదాత ఏం చేశాడంటే?
X

దిశ, మల్లాపూర్ : కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలకు కష్టాలు తీరడం లేదు. అక్కడ జరుగుతున్న మోసాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నల్ల వంశీ అనే రైతు నెల రోజుల కిందట తీసుకొచ్చిన వడ్లను అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అయితే, 41కిలోలకు తూకం వేయించి గుండం పల్లి మిల్లర్ల వద్దకు తీసుకువెళితే సంచికి 4 కిలోల తరుగు అయితేనే తీసుకుంటామని లేదంటే తీసుకోమని తిరస్కరించారు. దీంతో ఆవేదన చెందిన రైతు ధాన్యానికి నిప్పంటించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చివరకు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరకు పోయామన్నాడు. అయితే, ఆరుగాలం తాము శ్రమించి పండించిన పంటను మిల్లర్లు దోచుకుంటున్నారని వాపోయాడు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళితే వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధిత రైతు. మిల్లర్లు చెప్పినట్టు తూకం వేస్తేనే ధాన్యం తీసుకుంటామని లేనియెడల తీసుకోమని చెప్పడంతో బాధిత అన్నదాత తలపట్టుకున్నాడు.

వజ్రం లాంటి వడ్లని వద్దంటున్నారు : నల్ల వంశీ

క్వాలిటీ ధాన్యంలో కావాలనే తరుగు తీస్తు్న్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మిల్లర్లు దోపిడీ చేస్తు్న్నారు. కడుపు కాలి రైతులు తిరగబడినందుకు వడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. సంబంధిత వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలి.

Advertisement

Next Story