విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

by Shyam |
విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన రైతు మక్కల్ల సమ్మయ్య(48) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం బంగ్లపల్లి సమీపంలో ఎడ్లను మేపుతుండగా నేలపై ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story