- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ షాక్‌తో రైతు మృతి
దిశ, దుబ్బాక: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక రైతు మృతి చెందిన ఘటన మరువకముందే మరో రైతు ఉసురు తీసుకుంటున్న ఘటనలు దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో అనేకం జరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ రైతు మృతి చెందాడు. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సూరంపల్లి చంద్రయ్య (56) తన వ్యవసాయ పొలం వద్ద గల ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ వైర్ వేయడానికి ట్రాన్స్ ఫార్మర్ బంద్ చెశాడు. కాగా ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా బంద్ కాకపోవడంతో మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం తో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు సంబందించిన సామాగ్రి తెచ్చి రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిర్లక్యానికి మారుపేరుగా మండల విద్యుత్ అధికారులు మారారని, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారుల పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.