అప్పులున్నాయని ఓ రైతు ఇలా చేశాడు

దిశ, మునుగోడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునుగోడు మండలం వెల్మకన్నెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో వరికుప్పల యాదయ్య(37)అనే రైతు తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు.పెట్టుబడి కోసం సుమారు 4 లక్షలు అప్పుచేశాడు. దిగుబడి సరిగా రాక చేసిన అప్పు పెరిగిపోతుండటంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునుగోడు ఎస్సై రజనీకర్ తెలిపారు.

Advertisement