- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ భరించలేక రైతు ఆత్మహత్య
దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఏదో ఒక జిల్లాలో ఇటువంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పుల బాధ తాళలేక ఓ రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వస్పరి నాగయ్య (42) తనకున్న 5 ఎకరాల్లో పత్తి, వరి పంట సాగు చేశాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందుకు సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు.
గత మూడేళ్ళుగా ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ సారి సాగుచేసిన వరి పంటను కూడా కొనము అని ప్రభుత్వం చెప్పడంతో అప్పుల వారు ఒత్తిడి పెంచారని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకెళ్లిన నాగయ్య.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మంగళవారం పొలంవద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని కుటుంబీకులు కన్నీరుపెట్టుకున్నారు. రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు.