- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రాక్టర్ అమ్మకాల్లో 12శాతం వృద్ధి : క్రిసిల్!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ విభాగంలో అమ్మకాలు 10-12 శాతం వృద్ధి సాధిస్తాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ బుధవారం తెలిపింది. తాము ఇదివరకు అంచనా వేసిన 1 శాతం ప్రతికూల వృద్ధిని అధిగమిస్తూ ట్రాక్టర్ అమ్మకాలు 12 శాతం వరకు వృద్ధిని సాధించగలవని, కరోనా ఉన్నప్పటికీ అధిక వ్యవసాయ ఆదాయం కారణంగానే ఈ వృద్ధి నమోదవుతున్నట్టు క్రిసిల్ అభిప్రాయపడింది. ఈ ఏడాది రుతుపవనాల కారణంగా వ్యవసాయ రంగం మెరుగ్గా ఉన్న నేపథ్యంలో డిమాండ్ సైతం అధికంగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది.
కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రతికూల వృద్ధి నమోదైందని, రెండో త్రైమాసికం నుంచి ట్రాక్టర్ విక్రయాలు భారీగా పుంజుకున్నాయని క్రిసిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వ్యవసాయంపై ప్రభుత్వ వ్యయం బలమైన పెరుగుదల నేపథ్యంలో వ్యవసాయ ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇది ట్రాక్టర్ అమ్మకాల వృద్ధికి దోహదపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి చెప్పారు.