బన్నీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

by Shyam |
బన్నీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
X

స్టార్ హీరోలు తమ వ్యక్తిగత సహాయకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంలో ముందుంటారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బన్నీ… తన ఎదుగుదలకు కారణమైన ప్రతీ ఒక్కరినీ వీడియో కాల్ ద్వారా పలకరించి థాంక్స్ చెప్పాడు. నా పిల్లర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. అలాంటి బన్నీ తన వ్యక్తిగత సహాయకుల్లో ఒకరైన శివ పుట్టినరోజును ఘనంగా నిర్వహించార ట. లాక్ డౌన్ కారణంగా కేక్స్ దొరకకపోవడంతో ఇంట్లోనే కేక్ తయారు చేయించి మరీ కట్ చేయించాడట.

కాగా ఇప్పుడు ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. బన్నీ కొడుకు అల్లు అయాన్ తో కలిసి శివ పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా… బన్నీ బర్త్ డే సాంగ్ పాడుతున్నాడు. దీంతో బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నీ ఫ్యాన్ అయినందుకు సూపర్ హాపీగా ఉన్నాం అంటున్నారు ఫ్యాన్స్.

Tags :Allu Arjun, Allu Ayaan, Birthday, Tollywood

Advertisement

Next Story

Most Viewed