అదేం ఫీల్డింగ్.. అవేం క్యాచ్ డ్రాప్‌లు

by Shiva |
అదేం ఫీల్డింగ్.. అవేం క్యాచ్ డ్రాప్‌లు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి గెలిచింది. మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ అభిమానులు కోహ్లీ సేనపై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి ఆర్సీబీ చెత్త ఫీల్డింగే కారణం. ఐపీఎల్ అంటేనే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఆడుతుంటారు. మిగతా లీగ్స్‌తో పోల్చితే ఐపీఎల్‌లో ప్రొఫెషనలిజం ఎక్కువ. కానీ శుక్రవారం ఆర్సీబీ వదిలేసిన క్యాచ్‌లు చూస్తే ఏదో గల్లీ క్రికెట్ చూస్తున్నట్లు అనిపించింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా క్యాచ్‌లు వదిలేసిన వారిలో ఉండటం గమనార్హం. 17వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేసాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ కూడా కిషన్ ఇచ్చిన క్యాచ్ వదిలేషాడు. కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ వదిలేశాడు. బంతి చేతుల్లో నుంచి దూసుకెళ్లి కోహ్లీ ముఖానికి తగిలింది. అయితే కోహ్లీకి ఎలాంటి గాయం కాలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు వదిలేయగా.. కష్టమైన క్యాచ్‌లు రెండు పట్టుకోవడం విశేషం. ముఖ్యంగా తన బౌలింగ్‌లోనే వాషింగ్టన్ సుందర్ వెనక్కు పరిగెత్తి మిడ్ వికెట్ వద్ద క్రిస్ లిన్ ఇచ్చిన క్యాచ్ పట్టాడు.

Advertisement

Next Story

Most Viewed