- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ‘రాజమౌళి రామాయణం’ హవా
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. తెలుగు చిత్రాలను పాన్ ఇండియా సినిమాలుగా తీస్తున్నారంటే దానికి కారణం ఆయనే. తన విజన్ తో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడంలో రాజమౌళి దిట్ట. మగధీర, బాహుబలి సినిమాలతో ఆయన తన సత్తా చాటారు. దాంతో భారత ఇతిహాసమైన రామాయణాన్ని రాజమౌళి దర్శకత్వంలో వెండితెరపై తీసుకువస్తే చూడాలని భారతీయ సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. 80వ దశకంలో రామాయణం, మహాభారతం, శ్రీ కృష్ణ వంటి సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. టెలివిజన్ చరిత్రలో అవి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాయి. లాక్ డౌన్ సమయంలో… ప్రేక్షకుల కోరిక మేరకు రామానంద్ సాగర్ దర్శకత్వంలో నిర్మితమైన రామాయణం సీరియల్ ను దూరదర్శన్ పునః ప్రసారం చేస్తోంది. ఇప్పుడు కూడా రామాయణం సీరియల్‌ను భారత ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ సీరియల్ కారణంగా దూరదర్శన్ ఎప్పుడూ లేని విధంగా టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ‘రామాయణం’ను వీక్షించారు. ఒకే రోజులో బుల్లి తెరపై ఎక్కువ మంది చూసిన సీరియల్ గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ధర్శక ధీరుడు రాజమౌళిని రామాయణాన్ని సినిమాగా మలచాలని ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ ను రాముడిగా చూపించాలని కోరుతున్నారు. నెటిజన్లు చేస్తున్న ట్వీట్లతో రాజమౌళి మేక్ రామాయణ్ (#rajamoulimakeramayan#) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంది. రామాయణం సంగతి ఏమో కానీ.. రాజమౌళి ‘మహాభారతం’ సినిమా గా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి రాజమౌళి .. ప్రేక్షకుల కోరికకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
tags: rajamouli, twitter, trending, ramayanam