- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖ చిత్రకారుడు, పద్మభూషణ్ లక్ష్మణ్ పాయ్ కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్ : గోవాకు చెందిన ప్రముఖ చిత్రాకారుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ పాయ్ (95) సోమవారం ఉదయం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. తన చిత్రాలతో మెస్మరైజ్ చేచేసి వ్యక్తి లక్ష్మణ్ పాయ్. 1962లో గోవాలో జన్మించిన ఆయన.. ఎన్నో పురస్కారాలు, సన్మనాలు అందుకున్నారు. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మ భూషణ్, పద్మశ్రీ, నెహ్రూ, లలిత కళా అకాడమీ పురస్కారాలు ప్రధానం చేసింది.
పద్మభూషణ్ లక్ష్మణ్ పాయ్ మృతికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ ట్విట్టర్ వేధికగా సంతాపం ప్రకటించారు. ‘‘గోవాకు చెందిన ప్రముఖ కళాకారుడు, పద్మభూషణ్ లక్ష్మణ్ పాయ్ కన్నుమూత ఆవేదన కలిగించింది. గోవా రాష్ట్రం ఒక రత్నాన్ని కోల్పోయింది. కళాకారునిగా లక్ష్మణ్ పాయ్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు. గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్ కూడా లక్ష్మణ్ పాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ తన కొన ఊపిరి ఉన్నంత వరకూ కళకే అంకితమయ్యారని కొనియాడారు.