ఘోర విషాదం బిడ్డతో సహా తల్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య 

by Shyam |
MEDAK
X

దిశ కొండపాక : కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ తల్లి తన ఏడాదిన్నర కుమారుడు పై కిరోసిన్ పోసి తగలబెట్టి తాను కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తల్లి గవ్వల నవిత 22, ఏడాదిన్నర కుమారుడు మణిదీప్ మంటల్లో కాలి బూడిదయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గవ్వల స్వామితో చేర్యాల మండలం వేచరేని గ్రామానికి చెందిన నవితతో 2013 లో వివాహం జరిగింది. నవిత తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం నిజామాబాదులో ఉంటున్నారు.

వీరికి వివాహమైన కొత్తలో జీవనోపాధి కోసం రామాయంపేటలో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. స్వగ్రామమైన సిరసనగండ్లకు సంవత్సరం క్రితం వ్యవసాయ పనులు చేసుకోవడం కోసం తిరిగి వచ్చారు. గ్రామంలో చిన్న ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య వారం రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో నవిత తన తల్లిదండ్రులకు, సోదరుడికు సమాచారం ఇచ్చింది. ఈ విషయంలో వారు స్వామిని ఫోన్‌లో అడగగా కొట్టుకుంటా, చంపుకుంటా అనే దురుసుగా సమాధానం ఇచ్చాడని నవిత బంధువులు తెలిపారు. గొడవలతో కలత చెందిన నవిత శనివారం మధ్యాహ్నం భర్త స్వామి పొలం పనులకు వెళ్లగానే ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను కొడుకు పై పోసి తనపై పోసుకొని అంటిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన పరిసరాల వారు వెళ్లి చూసేసరికి అప్పటికే కాలి ముద్దయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకుని వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించారు. త్రీ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed