- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్యా.. ఆత్మహత్యలా..? విషం తాగి, గడ్డివాముకు నిప్పంటించుకుని నలుగురు మృతి..!
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పోలీసులు మాత్రం వీరిది సామూహిక ఆత్మహత్యలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. జిల్లాలోని పళని సమీపం పట్టకగుంటన్ ప్రాంతంలో మృతదేహాలను గుర్తించారు.
అయితే, చనిపోవడానికి ముందు రోజు రాత్రి విషం తాగిన కుటుంబసభ్యులు అనంతరం పక్కనే ఉన్న గడ్డివాముకు కూడా నిప్పంటించుకున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.