ఇద్దరు పిల్లలతో కలసి దంపతుల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?

by Sumithra |
ఇద్దరు పిల్లలతో కలసి దంపతుల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని మామిడికుదురు మండలం మొగలికుదురులో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం తమ పిల్లలతో కలసి భార్యభర్తలు బైక్‌పై చంచినాడ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి నదిలో దూకి బలవన్మరాణానికి పాల్పడ్డారు. నలుగురు ఒకే సారి నదిలోదూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు లభ్యం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఆర్థికంగా మోసం చేసినట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story