లాక్ డౌన్ కష్టాలు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

by vinod kumar |   ( Updated:2020-03-30 02:16:06.0  )
లాక్ డౌన్ కష్టాలు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
X

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పేదలు పనిదొరక్కపోవడంతో కడుపు మాడ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం చండీగఢ్‌ పోలీసులకు ఓ మహిళ ఫోన్‌ చేసింది. తమకు ఇంట్లో తినడానికి తిండి లేదనీ, అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ముందులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయింది. తమ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరంతమ బిడ్డ వైద్యానికి ఆర్థిక సహాయం చేసి, అవసరమైన ఆహారాన్ని అందించి ఆదుకున్నారు.

Tags: lockdown, chandigarh, faimily attempted to suicide, corona, virus,

Advertisement

Next Story

Most Viewed