బాధితుల ఆవేదన.. అధికారి ‘కాళ్లు’ పట్టుకుని రెమిడెసివర్ అడిగితే..

by Shamantha N |
బాధితుల ఆవేదన.. అధికారి ‘కాళ్లు’ పట్టుకుని రెమిడెసివర్ అడిగితే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా సోకిన వారితో ఆసుపత్రులు నిండిపోయాయి. దీంతో చాలా ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారికి ఇచ్చే రెమిడెసివర్ ఇంజక్షన్ కొరత ఏర్పడింది. అయితే నోయిడా నగరంలోని ఆసుపత్రుల్లో కూడా రెమిడెసివర్ దొరకడం లేదు. ఈ కారణంగా కరోనా రోగులకు రెమిడెసివర్ ఇవ్వాల్సిందిగా కరోనా సోకిన వ్యక్తుల కుటుంబాల సభ్యులు చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) దీపక్ ఓహ్రి కాళ్లు పట్టుకుని అభ్యర్థించారు. కన్నీరు పెట్టుకుని ఆవేదనతో అధికారిని అడిగారు. ఈ సందర్భంగా ఆయన.. వారికి రెమ్‌డెసివిర్ అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు.

Advertisement

Next Story

Most Viewed