- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్.. బాల్‌కు బెట్టింగ్.. కోసు పందాలతో కుటుంబాలు గుల్లా..
దిశ, వెంకటాపురం : ఓ పైపు ఉత్కంఠంగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు.. మరోవైపు ఏజెన్సీలో మితి మీరుతున్న పందాలు వెరసి మండలంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా మర్రి వృక్షంలా వేళ్లు వేసుకుంది. క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ఇటీవల కొంత మంది యువకులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించినా వారి పంథా మారలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యదావిధిగా క్రికెట్ బెట్టింగ్ నడూస్తూనే ఉంది. బెట్టంగ్ ఉచ్చులో మధ్యతరగతి యువత కూరుకు పోతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకు పోతున్నారు. గతంలో క్రికెట్ ప్రపంచకప్ పోటీలకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్, ఇప్పుడు ఏస్థాయి మ్యాచ్‌ల కైనా జడలు విప్పుతుంది. మ్యాచ్ వేగం, ఉత్కంఠను పెంచిన ఐపీఏల్ 20-20 మ్యాచ్‌ల బెట్టింగ్ మరింత ఆజ్యాన్ని పోసిందని ప్రస్తుత పరిణామాల బట్టి తెలుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగులు పట్టణాలకే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు బెట్టింగ్ భూతం పల్లెలకు విస్తరించింది. పట్టనాలకు ధీటుగా మండలాల్లో బెట్టింగ్ సాగుతుంది. మ్యాచ్‌లు జరిగే ప్రతిసారీ లక్షల్లో కోసు పందాలు జరుగుతున్నాయి. మ్యాచ్ ప్రారంభమైంది మొదలు ప్రతి బంతికీ ఫోర్ కొడతారని ఓకరు, సిక్స్ కొడతరని మరొకరు, ఔట్ అవుతారని, క్యాచ్‌పడుతారంటూ ఇలా లక్షల్లో పందాలు నడుస్తున్నాయి.
అంతా ఆన్‌లైన్‌లోనే…
గతంలో మ్యాచ్ బెట్టింగ్ ల కోసం గుంపులు గుంపులుగా చేరి పందాలను కాస్తుండటంతో వెంటనే విషయం బహిర్గతమయ్యేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో బెట్టంగ్‌లు అన్ని ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోనులో బెట్టింగు రాయుళ్లు 1x అనే యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ఆ యాప్ ద్వారా మ్యాచ్ ప్రాంరంభం కాగానే మొదట ఈ టీమ్ టాస్ గెలుస్తుంది అని బెట్టింగ్ ప్రారంభమవుతుంది. ఈ బాల్‌కు వికెట్ పడుతుందని. ఈ ఓవర్లో ఇన్నిపరుగులు వస్తాయని, ఈ బాల్‌కు బ్యాట్స్‌మెన్ ఫోర్ కొడతాడని, సిక్స్ లేదా అవుట్ అవుతాడంటూ లక్షల్లో పందాలు కాస్తున్నారు. రూ.10,000 లు పందం కాస్తే మ్యాచ్‌గెలిచిన అనంతరం నిర్వాహకుడు రూ.27,000 చెల్లిస్తాడు. ఈలా అత్యశకు పోయి మధ్యతరగతి యువకులు లక్షల్లో పందాలు కాస్తూ అప్పుల పాలవుతున్నారు.
ప్రతి రోజు లక్షల్లో బెట్టింగ్..
మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్, జగదాంబ సెంటర్, ఏస్బీఐ సమీపంతో పాటు చొక్కాల, వీఆర్‌కేపురం, ఉప్పేడువీరాపురం, ఆలుబాక తదితర ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిరోజు లక్షల్లో క్రికేట్ బెట్టింగులు జరుగుతున్నట్లు యువకులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు కోసుపందాలు కారణంగా రూ.1000 పెడితే పదివేలు వస్తాయి అని దురాశలో యువకులు బెట్టింగ్ కు ఆకర్షితులు అవుతున్నారు. నిర్వహకులు యువకుల వద్ద నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. పోయిన సొమ్ములు బెట్టింగులోనే సంపాదించాలని భావించిన యువకులు మరింత అప్పుల పాలు అవుతున్నారు.
పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా మారని పంథా
బెట్టింగ్ రాయుళ్ల పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల మండలంలో జోరుగా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు, పల్లెల్లోని బెట్టింగ్ రాయళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. యవకులు ఫోన్లలో క్రికెట్ బెట్టింగులకు సంబంధించిన యాప్‌లను గుర్తించి బెట్టింగుల వల్లకలిగే నష్టాలను వివరించి, బెట్టింగ్ ఊబిలో చిక్కుకోవద్దంటు యువకులకు పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినా కొందరు బెట్టింగు రాయళ్లు తమ పంథా మార్చుకోలేదని తెలుస్తుంది. ఇకనైనా స్థానిక పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక దృష్టి సారించి మధ్యతరగతి యువకులు క్రికెట్ బెట్టింగ్ బారినుండి కాపాడేలా చర్యలు తీసుకోవాలని తల్లి, దండ్రులు కోరుతున్నారు.