- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఉష్ణోగ్రతలు 3.4 డిగ్రీలకు పడిపోయాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 3.6, కొమురంభీం జిల్లా గిన్నెధరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో కేవలం 6 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా దొంగిల్లో 4.7, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.0, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సత్వర్లో 5.1 డిగ్రీలు నమోదైంది. మరోవైపు హైదరాబాద్లో కూడా చలి పెరుగుతోంది. రాజేంద్రనగర్ పరిధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 7.8గా ఉంది.
Advertisement
Next Story