'పీఎం కేర్ ఫండ్' పేరిట నకిలీ యూపీఐ ఐడి

by Shamantha N |
పీఎం కేర్ ఫండ్ పేరిట నకిలీ యూపీఐ ఐడి
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టే పోరాటంలో భాగం అయ్యేందుకు ‘పీఎం కేర్స్ ఫండ్’ కు విరాళాలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు అందజేసే విరాళాలు సరైన చోటికే వెళ్తున్నాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఈ విరాళాలపై కన్నేశారు. ప్రధాని ప్రకటించిన యూపీఐ ఐడిని పోలిన ఒక ఫేక్ యూపీఐ ఐడి(pmcare@sbiని క్రియేట్ చేశారు. వాస్తవ ఐడీలో pmcares అని ఉంటుంది)ని ప్రచారం చేస్తున్నారు. నకిలీ ఐడిని పోలీస్ అధికారులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎస్బిఐ కూడా నకిలీ ఐడి ఉన్న అకౌంట్ ను బ్లాక్ చేసింది. అందుకే సరైన ఐ డి pmcares@sbiకి విరాళాలు అందజేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం పేర్కొంది. (PIBFactcheck: The correct UPI ID of #PMCaresFunds is pmcares@sbi,”)

కరోనాపై పోరుకు విరాళాలను పీఎం కేర్స్ ఫండ్ కు అందజేయాలని ప్రధాని శనివారం కోరిన విషయం తెలిసిందే. ఈ విరాళాలను డెబిట్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టిజిఎస్, జిఎస్, నెఫ్ట్ ద్వారా అందించవచ్చు.

Tags : Coronavirus, pm cares fund, fake, upi id, cyber crime

Advertisement

Next Story